24, డిసెంబర్ 2011, శనివారం

జీవితం నేర్పే పాటాలు ..

*ఏ పని చేసే ముందు అయినా కాస్త ఆలోచించు..

*కాస్తంత ఓపికగా వుండు..

*ఇతరులను అపార్దం చేసుకొనే ముందు వారు అల్లా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో కొద్దిగా ఆలోచించు..

*నీ బలాలను, బలహీనతలను గుర్తించు..

*రోజూ కొంత నేర్చుకొంటూ నీ శక్తిని పెంపొందించుకో..

*అనవసర విషయాలను ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకు..

*మంచి హాబీ లను అలవరచుకో..

*కొత్త విషయాలను నేర్చుకో వాలన్న ఆసక్తిని ఎప్పటికీ ఉంచుకో..

*అవకాశం వచ్చినప్పుడు వదులుకోకు..

*బలహీనతలకు పూర్తిగా లొంగి పోకు ..

*ఏదయినా ఒక రంగంలో నిష్ణాతుడిగా అవడానికి ప్రయత్నించు ..

*నేను అన్న 'అహం' తగ్గించుకో..

*తప్పులనుండి నేర్చుకో...

*కలలు కను..వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు..


*ఆపదలో ఉన్నవారికి నీవంతు సహాయం చేయి..


*సమస్యను తక్కువ అంచనా వేయకు..వాటిని పరిష్కరించే నీ సామర్ధ్యాన్ని కూడా తక్కువ అంచనా వేయకు..


*ఎదుటివారి మనోభావాలను కూడా గౌరవించు..


*మంచి నిర్ణయాలను తీసుకో..


*వివేకాన్ని పెంచుకో..


*సమయాన్ని సద్వినియోగ పరచుకో..


*తీవ్రమైన ప్రతికూల పరిస్తితులలో ,వత్తిడిలో కూడా ప్రశాంతంగా వుండు..


*చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడూ కోల్పోకు..






15, డిసెంబర్ 2011, గురువారం

జీవితంలో నెమ్మదిగా అభివృద్ధి చెందడం ఎలా?

నేను మూడు సంవత్సరాల క్రితం మార్నింగ్ వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ..మొదట్లో రెండు రౌండ్లు వేసేవాడిని..ఒక రౌండు  జాగింగు చేసేవాడిని ..తరువాత మూడు రౌండ్లు వాకింగ్ ..రెండు రౌండ్లు జాగింగ్ ..కొద్దిగా అలవాటైన తరువాత అయిదారు రౌండ్లు వాకింగ్ ..పది రౌండ్లు జాగింగ్ ..ఇలా నెమ్మది నెమ్మది గా నా మార్నింగ్ వాకింగ్ కం జాగింగ్ అలవాటును  కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేశాను..ఈ నెమ్మది నెమ్మది గా ఇంప్రూవ్ అవ్వడం అనేది నాకు సంబందించి అన్నింటికీ వర్తిస్తుంది.. 

అది  హాబీ ల విషయం లో కావచ్చు ..కెరీర్ విషయం లో కావచ్చు ..ఇంకా వ్యక్తిగత గోల్స్ విషయం లో కావచ్చు..

ఉదాహరణకు కెరీర్ విషయం తీసుకొంటే ..మొదట ఒక టెక్నాలజీ ..తరువాత ఇంకొక టెక్నాలజీ ..ఈరెండింటిలో పరవా లేదు అనుకొన్నప్పుడు ఇంకొక పడవమీద కాలు..అదే ఇంకొక టెక్నాలజీ..హాబీ ల విషయం తీసుకొంటే ఒక హాబీ ..తరువాత ఇంకొక హాబీ ..నెమ్మదిగా ఇంకొక మంచి హాబీ..ఇలా..
 
ఇలా చేపుకొంటూ పోతే ..చాలా విషయాల్లో నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అవ్వడం అనేది చాలా సంతృప్తినిస్తుంది..

ఏదైనా ఒక పనిని కొంత సేపు చేస్తే దాని పైన అవగాహన వస్తుంది..కొద్ది రోజులు చేస్తే దాని పైన పట్టు వస్తుంది..అలా చాలా కాలం చేస్తే దాంట్లో మాస్టర్ అవ్వొచ్చు ...

కావలసిందల్లా ఒక విషయంపై ఆసక్తి పెంచుకోవడం..కొద్ది కొద్ది గా లక్ష్యం సెట్ చేసుకోవడం..దానిని రోజూ వారీగా కొంత సమయం కేటాయించి నెమ్మదిగా మన లక్ష్యం చేరుకోవడం..


21, నవంబర్ 2011, సోమవారం

బ్రహ్మి !!

బ్రహ్మి యాస్ చేగువేరా ..


యాస్ బాడ్ బాయ్..అండ్ spider మాన్..

యాస్ ఏ చాంప్..

యాస్ సాయి బాబా..


20, నవంబర్ 2011, ఆదివారం

లెవోన్ అరోనియన్ !!


పైన ఫోటో లో కనిపిస్తున్న వ్యక్తి ఆర్మేనియన్  చదరంగం ఆటగాడు 'లెవోన్ అరోనియన్'.విశ్వనాధన్ ఆనంద్ ఫై 'గారి  కాస్పరోవ్'  తరువాత ప్లస్ స్కోరు కలిగిన ఏకైక ఆటగాడు..ప్రస్తుతం ప్రపంచం మొత్తం లో ౩ వ  రాంక్ (ఆనంద్ తరువాత)కలిగిన ఆటగాడు..మంచి ఆటగాడే కాకుండా ,ఉత్తమ వ్యక్తి..మాములుగా చదరంగం ఆటగాల్లంటే సీరియస్ గా ,లోతుగా ఆలోచిస్తున్నట్టు  గంభీరం గా వుంటారు..కాని యితడు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన వ్యక్తి..

క్లాసిక్ ,బ్లిట్జ్ మరియు రాపిడ్ ఏ విభాగం లో నైనా సరే బాగా ఆడుతాడు..అప్పుడప్పుడు ఆటగాని మనస్తత్వాన్ని బట్టి
కొన్ని చీప్ ట్రిక్కులు వాడి ,ప్రత్యర్ధులను బుట్టలో వెయ్యడం లో సిద్దహస్తుడు..gifted techinician ..చాల  డేంజరస్ ఆటగాడు..

సినిమాలు ,సాహిత్యం ,ఆర్టు  మనోడి హాబీలు ....

                                             జీవితమే ఒక చదరంగం..

                                          అన్న స్టెప్ ఎస్తే మాస్ ....


                                                        సన్నీ బాయ్! !..వివా లెవోన్. .వివా..!!

18, నవంబర్ 2011, శుక్రవారం

వీడింతే..

ఈ రోజునుండి కొద్దికాలం ఉద్యోగం బందు చేద్దామని అనుకుంటున్నాను అంటూ తన  మార్కు స్టైల్ లో.. నివాస్ గాడు   చెప్పాడు నిర్లక్ష్యంగా.. వీడు ఇలాంటి షాక్ లు ఇవ్వడంకొత్తేమి కాదు..అయిదేళ్ళలో ఇప్పడికే రెండు సార్లు బందు పెట్టాడు.
ప్రత్యేకమైన కారణం ఏదీ ఉండదు..జస్ట్ లైక్ డాట్ ..వీడికి దగ్గర దగ్గరగా ముప్పై ఏళ్ళ దగ్గరికి వచ్చాడు..జీవితం లో ఏ  లక్ష్యం ఉన్నట్లు కనిపించదు..నిర్లక్ష్యం గా ఉంటాడు..బరువు బాద్యత లాంటి పదాలు  వాడికి నచ్చవు..ఇంటికి కూడా అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు పంపిస్తాడు..
..........వీడికి సలహాలు ఇవ్వడం వేస్టు..వీడు నిర్ణయం తీసుకోన్నాకే చెబుతాడు కాబట్టి ..ఈసారి నేను వీన్ని కన్విన్సు చేయడానికి ప్రయత్నించలేదు..కాని ఉత్త గా ..రూం లో కూర్చొని ఏమిచేస్తాడు వీడు ?మహా అంటే ..వీడికిష్టమైన టైం కి
నిద్ర లేస్తాడు..స్నానం చేస్తే చేస్తాడు ..లేకపోతె లేదు..పార్క్ కి వెళ్లి ఆ ఈనాడు ,సాక్షి పేపర్లు ముక్క వదిలి పెట్టకుండా చదువువుతాడు.. ఆ ఇంటర్నెట్ ముందు  కూర్చొని అదీ ,ఇదీ చదువుతాడు..ఇష్టం వచ్చ్చింది వండుకొని తింటాడు..\
........మళ్ళీ కొద్దిసేపు పడుకొంటాడు..లేచాక ఆ చలం ,బాల గంగాధర తిలక్ అంటూ అవేవో పుస్తకాలు చదివి ,కాస్త పుస్తక జ్ఞానం ఉన్నవాల్లతో సోది చర్చలు పెడతాడు..(ఈ దినచర్య వాడు శని,ఆదివారాల్లో చేస్తాడు లెండి.బహుశా దీన్ని మిగతా రోజుల్లో కూడా అమలు పరుద్దామని  వీడి ఎజెండా ..)
నీవు జీవితం లో సెటిల్ అవ్వాలి ..పెళ్లి చేసుకోవాలి అంటే..అసలు జీవితం అంటే ఏమిటి? ..పెళ్లి ఎందుకు అంటాడు?..
అలా మాట్లాడతావు ఏంట్రా ? నీకు జీవితం లో తోడు అక్కరలేదా? ..పిల్లలు అవసరం లేదా అంటే ..ఒక కప్పు కింద భార్యా ,భర్తలు సంవత్సరాల కొద్దీ ఎలా కలసి ఉంటారు ? ..అంటాడు..ఇక పిల్లల విషయానికి వస్తే ..నీవే ఒక అజ్ఞానివి..
నీవు మరొక అజ్ఞానికి జన్మనివ్వడం..ఆ అజ్ఞాని మరొకనికి జన్మనివ్వడం ..ఈ విధం గా ప్రపంచాన్ని అజ్ఞానులతో నింపే   బదులు నువ్వొక్కడివే జ్ఞానివి కావచు కదా అంటాడు..క్రికెట్లో కొన్ని బంతులు ఆడటం కష్టం ..చదరంగం లో ప్రత్యర్ది ఎత్తులకు కొన్నిసార్లు డిఫెన్సు కనుక్కోవడం కష్టం..అలాగే వీడి వాదాన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం..
వీడు రూములో కూర్చొని ఏమైనా చేయని ..కానీ రేప్పొద్దున (అంటే వీడు కావాలనకున్నప్పుడు) వుద్యోగం వస్తుందా ?..అంటే కచ్చితం గా వస్తుంది..ఎందుకంటే ..వీడికి టెక్నాలజీ మీద ఉన్న పట్టు అట్లాంటిది మరి..వీడు ఇచ్చే కీ వర్డులకు    గూగుల్ కి కూడా పిచ్చి ఎక్కి ఏడు సంద్రాల అవతల వున్నా ..వీడికి కావలసిన సమాచారం ..తీసుకొస్తుంది ..వీడి knowledge కి భయపడి క్లైంట్ కూడా ఎక్కువసేపు మాట్లాడాడు ..వాడి అజ్ఞానం బయటపడుతుందో ఏమో అని ..అదే వీడి ధైర్యం ..మొండితనం ...నిర్లక్ష్యం..వగైరా..వగైరా..

వీడి బద్ధకం గురించి ,జీవితం పట్ల వీడికి వున్నా దిక్కుమాలిన/ఉన్నతమైన అబిప్రాయాలను తర్వాతి పోస్టులో...


5, నవంబర్ 2011, శనివారం

@1 year software job!!

సాఫ్టువేరులో మనమొక వెర్రివెంగాలప్పలమని మనమీద మనకొక కాన్ఫిడెన్సు ..కీ బోర్డు  పట్టుకుంటే ఏమి అవుతుందో ..
మౌసు  పట్టుకుంటే ఏమి  అవుతుందో అన్న టెన్షన్..కానీ తినగా తినగా వేము తియ్యనుండు అన్నట్లుగా ,నేను కూడా 

కొంచం కొంచం తీయదనాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టాను..కీ బోఅర్డు షార్ట్ కట్స్ దగ్గరనుండి ,నా టెక్నాలజీ లోని బేసిక్స్  మరియు కొన్ని టిప్స్ ,ట్రిక్స్ నేర్చుకొని ..విజయవంతముగా సంవత్సరానికి పైగా జాబులో కొనసాగుతున్నాను..

ఇప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్సు పెరిగింది..సమస్యను సాల్వు చేయకున్నా ఎట్లీస్ట్ మేనేజ్ చేయగలుగుతున్నాను,..

కన్విన్సు చేయలేకున్నా,కన్ఫ్యూజు చేయ గలుగుతున్నాను..

ఒక సంవత్సరం సాఫ్టువేరు జాబు లో కొన్ని విశేషాలు..

1.ముఖ్యముగా సిస్టం లోని  బేసిక్స్ నేర్చుకున్నాను.

2 .జీవితంలోని బొర్ డం  కి దూరం అయ్యాను..

౩.కొంత సంపాదించాను.

పై ఫాక్టర్ వల్ల నాకు నేను బ్రతికాను.

ఈ.కొంత ఇంటికి డబ్బు పంపాను.

ఐ.ముంబై లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూశాను.

యి.కొంత మందికి సహాయం చేయగలిగాను. 

i .లప్తోప్,మొబైల్,క్లోత్స్ కొన్నాను.

జ.ఇతరులకు నాపై నమ్మకాని కలిగించాను.

కే.ముఖ్యముగా నా మీద నాకు కాన్ఫిడెన్సు పెరిగింది.

ఇంతేసంగతులు ..చిత్తగించవలెను..








2, నవంబర్ 2011, బుధవారం

key Board Short Cuts..1

Ctrl+F ...for searching purpose..

Ctrl+C..Copy the content.............

Ctrl+V..paste the content..

Window+D.. minimizing the all active windows..

Window+E..My Computer..

Window+R..command prompt..

Ctrl+S..save the data

Gorati venkanna !


19, అక్టోబర్ 2011, బుధవారం

.అమృతం కురిసినరాత్రి !!

ఈ మద్య నేను చదివిన పుస్తకాలు శ్రీ శ్రీ రాసిన అనంతం ,బాలగంగాదర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి .ఒకటి పద్యం మరొకటి గద్యం .రెండూ వేటికి అవే బాగుంటాయి .తిలక్ రాసిన కొన్ని పద్యాలలోని లైన్లు కొన్ని ..

మేం మనుష్యులం..
మేం మహస్సులం..
గుండెలోపలి గుండె కదలించి ..
తీగ లోపలి తీగ సవరించి..
పాట పాటకి లేచు కెరటంలాగా..మాట మాటకి మోగు కిన్నెరా లాగ..
మేం ఆడుతాం..
మేం పాడుతాం..
 .....................................
ఈ పద్యం మొత్తం బాగుంటుంది.. 

ఆ రోజులు అన్న పద్యం నుండి కొన్ని లైన్లు.

ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా 
ఆనందంలాంటి  విచారం కలుగుతుంది..

అంటూ సాగే ఈ కవిత చాలా బాగుంటుంది..

అలాగే ఆర్తగీతం లోని కొన్ని లైన్లు..

నేను చూశాను  నిజం గా  ఆకలితో అల్లాడి మర్రిచెట్టు 

కింద మరణించిన ముసలివాన్ని..

నేను చూశాను నిజంగా తల్లిలేక తండ్రి లేక ..తిండి లేక..

ఏడుస్తూ ఏడుస్తూ 

ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాల్వ 

పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలున్ని..

నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి ..

తాను నిరాహారుడై ..

అంటూ సాగే గీతం నిజం గా అద్భుతం !!

యిలా చెబుతూ పోతే ఎన్నో అద్భుతమైన పద్యాలు ఉన్నాయ్..

అల్లాగే ప్రార్ధన లో కొన్ని లైన్లు.

దేవుడా..

నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న 

మనుష్యులతో నిండిన దేశం నాది ..

ఆకలి బాధలూ ,ఆందోళనలూ ,సమస్యలూ 

విరివిగా ఊన్న విచిత్ర సౌధం మాది..

కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేశం ..

బ్రతుకు పొడుగునా స్వతంత్రం ..

కొంచెం పుణ్యం ..కించిత్ పాపం..

కాస్త కన్నీరు ..మరికాస్త సంతోషపు తేనీరు 

చాలు మాకు  తండ్రీ ..

................

..............


చావు పుట్ట్టుకల మద్య సందేహం లాంటి 

జీవితంలో నలువైపులా అంధకారం..

మంచి గంధం లాగ పరిమళించే మానవత్వం 

మాకున్న ఒకేఒక అలంకారం..

మజిలీ మజిలీకి అలిసిపోతున్నాం..

మలుపు మలుపుకీ రాలిపోతున్నాం..

..అంటూ సాగే గేయం ఎవరైనా తప్పక చదివి తీరాలి..

..మొత్తం గా ఈ పుస్తకం ఒక క్లాసిక్..చదీన తరువాత మనసంతా ..అనుభూతిమయం.









17, అక్టోబర్ 2011, సోమవారం

నా బ్లాగు పుట్ట్టిన్దోచ్ .

ఏదో రాద్దామని ..పొడిచేద్దామని ..ఇరగాదీద్దామని..ఈ బ్లాగ్ ని కష్టపడి ఓపెన్ చేశాను.హుమ్మ్ ..ఏమి రాయాలో అర్థం కావడం లేదు ..రేపటినుండి రాద్దాం లే ..అదుగో.మళ్ళీ వాయిదా ..ఒక బ్లాగ్ దుకాణం తెరుద్దామని సంవత్సరం నుండి  అనుకొంటున్నాను ..ఇదిగో..అదుగో..రేపుచేద్దాం లే ..ఎల్లుండి చేద్దాం లే అని వాయిదాలు..ఉందిగా సెప్టెంబరు ..మార్చి పైన ..వాయిదా పద్దతుంది ..దేనికైనా..జగడ ..జగడ..జగడ..జగడ..జగడజాం..

బ్లాగ్ అయితే తెరిచాను..ఏమి రాద్దాం చెప్మా?..ఏమి  మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు..స్టార్టింగ్ ప్రాబ్లం..వాకే..ఏదో రాద్దాం లే..ఈరోజేగా..తెరిచింది..నెమ్మదిగా రాసుకోవచ్చులే ..అని మన ఆత్మారం ..బోడి సలహా..ఆ మాత్రం కామన్ సెన్సు  మాక్కూడా ఉన్దిలేవోయ్..అన్ని రెడీమేడ్ సలహాలు..కొంచెం కూడా క్రియేటివిటీ లేదు..

సరే సరే ..ఆత్మారాం కి కోపం వచ్చేసింది..ఓకే ..ఎప్పటిలాగే సర్రెండర్ టు ఏ  ఫూల్ ..మై బాయ్ ఉయ్ విల్  స్టార్ట్ ఫ్రొం టుమారో..