ఈ మద్య నేను చదివిన పుస్తకాలు శ్రీ శ్రీ రాసిన అనంతం ,బాలగంగాదర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి .ఒకటి పద్యం మరొకటి గద్యం .రెండూ వేటికి అవే బాగుంటాయి .తిలక్ రాసిన కొన్ని పద్యాలలోని లైన్లు కొన్ని ..
మేం మనుష్యులం..
మేం మహస్సులం..
గుండెలోపలి గుండె కదలించి ..
తీగ లోపలి తీగ సవరించి..
పాట పాటకి లేచు కెరటంలాగా..మాట మాటకి మోగు కిన్నెరా లాగ..
మేం ఆడుతాం..
మేం పాడుతాం..
.....................................
ఈ పద్యం మొత్తం బాగుంటుంది..
ఆ రోజులు అన్న పద్యం నుండి కొన్ని లైన్లు.
ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా
ఆనందంలాంటి విచారం కలుగుతుంది..
అంటూ సాగే ఈ కవిత చాలా బాగుంటుంది..
అలాగే ఆర్తగీతం లోని కొన్ని లైన్లు..
నేను చూశాను నిజం గా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు
కింద మరణించిన ముసలివాన్ని..
నేను చూశాను నిజంగా తల్లిలేక తండ్రి లేక ..తిండి లేక..
ఏడుస్తూ ఏడుస్తూ
ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాల్వ
పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలున్ని..
నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి ..
తాను నిరాహారుడై ..
అంటూ సాగే గీతం నిజం గా అద్భుతం !!
యిలా చెబుతూ పోతే ఎన్నో అద్భుతమైన పద్యాలు ఉన్నాయ్..
అల్లాగే ప్రార్ధన లో కొన్ని లైన్లు.
దేవుడా..
నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న
మనుష్యులతో నిండిన దేశం నాది ..
ఆకలి బాధలూ ,ఆందోళనలూ ,సమస్యలూ
విరివిగా ఊన్న విచిత్ర సౌధం మాది..
కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేశం ..
బ్రతుకు పొడుగునా స్వతంత్రం ..
కొంచెం పుణ్యం ..కించిత్ పాపం..
కాస్త కన్నీరు ..మరికాస్త సంతోషపు తేనీరు
చాలు మాకు తండ్రీ ..
................
..............
చావు పుట్ట్టుకల మద్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం..
మంచి గంధం లాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకేఒక అలంకారం..
మజిలీ మజిలీకి అలిసిపోతున్నాం..
మలుపు మలుపుకీ రాలిపోతున్నాం..
..అంటూ సాగే గేయం ఎవరైనా తప్పక చదివి తీరాలి..
..మొత్తం గా ఈ పుస్తకం ఒక క్లాసిక్..చదీన తరువాత మనసంతా ..అనుభూతిమయం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి