తాళ్ మరణించాడన్న వార్త బాంబు లా వ్యాపించింది ..మిషా మరణించ కూడదు ..ఎందుకంటే రోజు వారీ జీవితం లో మిషా ది ప్రత్యేకమైన అందం ..ప్రత్యేకమైన తెలివి ..ప్రత్యేకమైన హాస్య చతురత..
ప్రపంచంలో చాలా మంది ఏదో ఒక కళకు అంకితమైపోతారు..ఆ కళ ను కొంత మందే ఆస్వాదిస్తారు..దానిలో ఉన్న ఆనందం కొద్ది మందికే తెలుసు..మిషా కి ఆ ఆనందం తెలుసు..చదరంగాన్ని మిషా ఆనందమయం చేశాడు..చదరంగం అతన్ని అనేక అనారోగ్య సమస్యలనుండి ..అసంత్రుప్తులనుండి దూరం చేసింది..
తాల్ ఒక అసాధారణ మనిషి ..ఒక అసాధారణ వ్యక్తిత్వం ..చదరంగాన్ని బొత్విన్నిక్ ఒక సైన్సు గా భావించాడు..కార్పోవ్ కేవలం ఆటగానే భావించాడు..కానీ తాల్ మాత్రం ఒక కళ గా స్వీకరించాడు..ఒక మెజీషియన్ గా చదరంగాన్ని శాసించాడు..అంతకు ముందు ఉన్ననియమాలు కాక ,తన ఎత్తులనే నియమాలు గా అంగీకరించేటట్లు గా చేశాడు..1950 దశకం లో ని ఆటగాళ్లకు తాళ్ ఒక ఆదర్శం..
ఈ దశకం లో బొత్విన్నిక్.స్మిస్లోవ్ లు చదరంగం లో రెండు పెద్ద తలకాయలు..చదరంగాన్ని ఒక పద్దతిగా ఆడేవాళ్ళు..
బ్రన్స్తేయిన్,కేరేస్ తమ అమోఘమైన తెలివి తేటలతో శిఖరాగ్ర స్థానం లో వున్నారు..పేత్రోసియన్ చదరంగాన్ని అందనంత ఎత్తులోకి తీసుకు వెళ్ళాడు..
ఎందరో మహామహులు ఉన్న ఈ ఆటలోకి తాళ్ ఒక పెను తుఫాన్ లా ,హరికేన్ లా దూసుకు వచ్చాడు..ఎత్తులను చేతితో కాక మంత్రదండం తో కదుపుతున్నడా అన్నంత మాయలో కి నెట్టివేసి 1957 ,58 సంవత్సరాల్లో సోవియెట్ చంపియన్ షిప్ ను గెలుచుకోవడమే కాకుండా 1961 లో ఏకంగా చదరంగ దిగ్గజం అయిన బొత్విన్నిక్ ను చిత్తు చేసి అతిపిన్న వయసులోనే (23 )ప్రపంచ చంపియన్ గా అవతరించాడు..
అది 1961 వ సంవత్సరం ..వందలాది చదరంగ ప్రియులు ఆట వీక్షించడానికి టికెట్టు దొరక్క హాలు బయటనుండే ఆటను వీక్షిస్తున్నారు..పుష్కిన్ థియేటర్ లో ని వాతావరణం అంతా కోలాహలం గా వుంది..పెద్ద తెరపై ఆటగాళ్ళు వేసే ఎత్తులను ప్రదర్శిస్తున్నారు..తాళ్ తన ఆరంభపు ఎత్తుల తరువాత వెంటనే ఒక గుర్రాన్ని త్యాగం చేశాడు..
బొత్విన్నిక్ కి ఇది ఒక చాలెంజ్..ఆట వీక్షిస్తున్న్ ప్రతి ఒక్కరూ తమ లెక్కలలోకి ,తర్కం లోకి దిగి పోయారు..ఏమీ జరగనట్లుగా తాళ్ ఆట జరుగుతున్న స్టేజి వంక ప్రశాంతం గా చూస్తున్నాడు..బొత్విన్నిక్ అప్పటికే చదరంగం లో దిగ్గజాలైన కాపబ్లంక,లస్కర్ మరియు స్మిస్లోవ్ పై విజయాలను నమోదు చేసుకొని వున్నాడు..
తాళ్ తన గుర్రాన్ని బలి చేయాలన్న సాహసవంతమైన నిర్ణయాన్ని తప్పు అని నిరూపించడానికి బొత్విన్నిక్ కి చాలా తర్కం అవసరం అయింది..అట్టే సమయం లేదు..సుదీర్ఘమైన ఆలోచనా సముద్రంలో మునిగి గంభీరం గా వున్నాడు..
ప్రేక్షకులందరూ ఉద్వేగం గా వున్నారు..బొత్విన్నిక్ ఏ ఎత్తు వేస్తాడో నని కుతూహలం గా వున్నారు..ప్రాంగణం మొత్తం ఫుట్ బాల్ మైదానం లా కోలాహలం గా వుంది ..చివరికి బొత్విన్నిక్ కి తాళ్ వత్తిడి కి తలొగ్గక తప్పలేదు..
ఈ మ్యాచ్ ని కోల్పోవడమే కాకుండా తన ప్రపంచ చంపియన్ హోదా ని తాళ్ కి కట్టబెట్టాడు..
ఆ తరం గ్రాండ్ మాస్టర్లకు తాళ్ విజయాల వెనుక రహస్యం కనిపెట్టలేక పోయేవారు..తాళ్ కి చదరంగం ఆడడం సులభం..మొజార్ట్ ఆటలో ఉన్నంత ఈజ్ అతని ఆటలో వుండేది..చాలా కొద్ది మంది ఆటగాళ్లకు మాత్రమె అతనిపై విజయాన్ని నమోదు చేసిన రికార్డు వుంది ..
బల్ల పై తన ఆటను మెరుగు పరచ్కొనే తీరు ,అనుకోని విధంగా బలగాలను బలి పెట్టడం ,తీక్షణ మైన చూపు..తమ ప్రత్యర్డులు యిట్టే తప్పులు చేయడానికి పురిగొలుపుతుంది..ప్రశాంతం గా కదిపే తన ఎత్తుల వెనుక ఎంతో పోరాట పటిమ వుంటుంది ..తన బలగాలకు ,ఎత్తులకు అతీంద్రియ శక్తులు ఆవహిస్తాయి..బలగాలు రొమ్ము నిండా గాలి పీల్చుకొని యుద్దరంగం లోకి దూకుతాయి..అందుకే తాళ్ అంటే ప్రేక్షకులకు ఆసక్తి..అతడు పాల్గొనే tournament ల లో తానే విజయం సాదించాలని కోరుకొంటారు..
తాళ్ యవ్వనం లో కూడా తన ఆరోగ్యం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు..జీవితం మొత్తం అనారోగ్యం తోనే కొనసాగింది..ఈ అనారోగ్యమే అతని అభివృద్దికి ఆటంకం గా మారింది ..బొత్విన్నిక్ తో తిరిగి నిర్వహించి న వరల్డ్ చాంపియన్ షిప్ మ్యాచ్ తాళ్ తన అనారోగ్యం కారణం గానే కోల్పోవలసి వచ్చింది..అనారోగ్యం కారణం గా మ్యాచ్ ని వాయిదా వేసే అవకాశం ఉన్నా తాళ్ ఆ పని చేయలేదు..ఆసుపత్రిలో ఆపరేషన్ రూం లో ముసుగు వేసేంత వరకూ తాళ్ చదరంగం గురించి మాట్లాడుతూనే ఉన్నాడని డాక్టర్ తెలిపాడు..
ఆసుపత్రి లో బాబి ఫిషర్ తో చదరంగం ఆట విశ్లేషిస్తున్నతాళ్
'Megician of Riga ' గా ముద్దు గా పిలుచుకొ బడే తాళ్ USA కి గాని USSR కి గాని వెళ్లి వుంటే ఎంతో పేరు ,డబ్బు గడించే వాడు..కానీ తన స్నేహితులందరూ రిగా లోనే వుండడం వాళ్ళ తాళ్ అటువైపుగా వెళ్ళలేదు..
Genius People అనేవాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు ..వాళ్ళు కాలం కంటే ముందు వుంటారు..తాళ్ చదరంగం లో తన కాలం లో అందరికంటే ముందు వుండే వాడు..చదరంగం ఆటలో అతని తెగింపు ,మెరుపుదాడి నేటి ఆటగాళ్లకు స్ఫూర్తి ..సాదారణ ఆటలో అసాదారణ మలుపులు తీసుకు రావడం ,ఆట ఏ మాత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థులలో కూడా ఒడుపుగా బలగాలను బలిపెట్టి ఆటను కళ్ళు మిరిమిట్లుగోలిపే విధం గా ముందుకి తీసుకు వెళ్ళడం తాళ్ ప్రత్యేకత ..
తాళ్ ది 'short and sweet life '. స్నేహితుల దృష్టిలో 'great and simple life '.తాళ్ కి లెక్కకు మించిన స్నేహితులు
వుండేవాళ్ళు.కానీ ఏ నాడు ఎవరిని డబ్బు అడగలేదు..ఎవరిపైనా కోపం చోపించేవాడు కాదు..ఈ లక్షణాలు అతని వ్యక్తిత్వానికి రంగులు అద్దింది..అతని జీవితం,creative inspiration ఎంతో మందికి స్ఫూర్తి..
ఈ ప్రపంచం తాళ్ ను ఎప్పటికీ గుర్తు చేసుకోంటూనే వుంటుంది ..ఎప్పటికీ తాళ్ ని కోల్పోయామన్న భావన లో వుంటుంది..



