19, అక్టోబర్ 2011, బుధవారం

.అమృతం కురిసినరాత్రి !!

ఈ మద్య నేను చదివిన పుస్తకాలు శ్రీ శ్రీ రాసిన అనంతం ,బాలగంగాదర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి .ఒకటి పద్యం మరొకటి గద్యం .రెండూ వేటికి అవే బాగుంటాయి .తిలక్ రాసిన కొన్ని పద్యాలలోని లైన్లు కొన్ని ..

మేం మనుష్యులం..
మేం మహస్సులం..
గుండెలోపలి గుండె కదలించి ..
తీగ లోపలి తీగ సవరించి..
పాట పాటకి లేచు కెరటంలాగా..మాట మాటకి మోగు కిన్నెరా లాగ..
మేం ఆడుతాం..
మేం పాడుతాం..
 .....................................
ఈ పద్యం మొత్తం బాగుంటుంది.. 

ఆ రోజులు అన్న పద్యం నుండి కొన్ని లైన్లు.

ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా 
ఆనందంలాంటి  విచారం కలుగుతుంది..

అంటూ సాగే ఈ కవిత చాలా బాగుంటుంది..

అలాగే ఆర్తగీతం లోని కొన్ని లైన్లు..

నేను చూశాను  నిజం గా  ఆకలితో అల్లాడి మర్రిచెట్టు 

కింద మరణించిన ముసలివాన్ని..

నేను చూశాను నిజంగా తల్లిలేక తండ్రి లేక ..తిండి లేక..

ఏడుస్తూ ఏడుస్తూ 

ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికికాల్వ 

పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలున్ని..

నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి ..

తాను నిరాహారుడై ..

అంటూ సాగే గీతం నిజం గా అద్భుతం !!

యిలా చెబుతూ పోతే ఎన్నో అద్భుతమైన పద్యాలు ఉన్నాయ్..

అల్లాగే ప్రార్ధన లో కొన్ని లైన్లు.

దేవుడా..

నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న 

మనుష్యులతో నిండిన దేశం నాది ..

ఆకలి బాధలూ ,ఆందోళనలూ ,సమస్యలూ 

విరివిగా ఊన్న విచిత్ర సౌధం మాది..

కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేశం ..

బ్రతుకు పొడుగునా స్వతంత్రం ..

కొంచెం పుణ్యం ..కించిత్ పాపం..

కాస్త కన్నీరు ..మరికాస్త సంతోషపు తేనీరు 

చాలు మాకు  తండ్రీ ..

................

..............


చావు పుట్ట్టుకల మద్య సందేహం లాంటి 

జీవితంలో నలువైపులా అంధకారం..

మంచి గంధం లాగ పరిమళించే మానవత్వం 

మాకున్న ఒకేఒక అలంకారం..

మజిలీ మజిలీకి అలిసిపోతున్నాం..

మలుపు మలుపుకీ రాలిపోతున్నాం..

..అంటూ సాగే గేయం ఎవరైనా తప్పక చదివి తీరాలి..

..మొత్తం గా ఈ పుస్తకం ఒక క్లాసిక్..చదీన తరువాత మనసంతా ..అనుభూతిమయం.









17, అక్టోబర్ 2011, సోమవారం

నా బ్లాగు పుట్ట్టిన్దోచ్ .

ఏదో రాద్దామని ..పొడిచేద్దామని ..ఇరగాదీద్దామని..ఈ బ్లాగ్ ని కష్టపడి ఓపెన్ చేశాను.హుమ్మ్ ..ఏమి రాయాలో అర్థం కావడం లేదు ..రేపటినుండి రాద్దాం లే ..అదుగో.మళ్ళీ వాయిదా ..ఒక బ్లాగ్ దుకాణం తెరుద్దామని సంవత్సరం నుండి  అనుకొంటున్నాను ..ఇదిగో..అదుగో..రేపుచేద్దాం లే ..ఎల్లుండి చేద్దాం లే అని వాయిదాలు..ఉందిగా సెప్టెంబరు ..మార్చి పైన ..వాయిదా పద్దతుంది ..దేనికైనా..జగడ ..జగడ..జగడ..జగడ..జగడజాం..

బ్లాగ్ అయితే తెరిచాను..ఏమి రాద్దాం చెప్మా?..ఏమి  మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు..స్టార్టింగ్ ప్రాబ్లం..వాకే..ఏదో రాద్దాం లే..ఈరోజేగా..తెరిచింది..నెమ్మదిగా రాసుకోవచ్చులే ..అని మన ఆత్మారం ..బోడి సలహా..ఆ మాత్రం కామన్ సెన్సు  మాక్కూడా ఉన్దిలేవోయ్..అన్ని రెడీమేడ్ సలహాలు..కొంచెం కూడా క్రియేటివిటీ లేదు..

సరే సరే ..ఆత్మారాం కి కోపం వచ్చేసింది..ఓకే ..ఎప్పటిలాగే సర్రెండర్ టు ఏ  ఫూల్ ..మై బాయ్ ఉయ్ విల్  స్టార్ట్ ఫ్రొం టుమారో..