నేను మూడు సంవత్సరాల క్రితం మార్నింగ్ వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ..మొదట్లో రెండు రౌండ్లు వేసేవాడిని..ఒక రౌండు జాగింగు చేసేవాడిని ..తరువాత మూడు రౌండ్లు వాకింగ్ ..రెండు రౌండ్లు జాగింగ్ ..కొద్దిగా అలవాటైన తరువాత అయిదారు రౌండ్లు వాకింగ్ ..పది రౌండ్లు జాగింగ్ ..ఇలా నెమ్మది నెమ్మది గా నా మార్నింగ్ వాకింగ్ కం జాగింగ్ అలవాటును కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేశాను..ఈ నెమ్మది నెమ్మది గా ఇంప్రూవ్ అవ్వడం అనేది నాకు సంబందించి అన్నింటికీ వర్తిస్తుంది..
అది హాబీ ల విషయం లో కావచ్చు ..కెరీర్ విషయం లో కావచ్చు ..ఇంకా వ్యక్తిగత గోల్స్ విషయం లో కావచ్చు..
ఉదాహరణకు కెరీర్ విషయం తీసుకొంటే ..మొదట ఒక టెక్నాలజీ ..తరువాత ఇంకొక టెక్నాలజీ ..ఈరెండింటిలో పరవా లేదు అనుకొన్నప్పుడు ఇంకొక పడవమీద కాలు..అదే ఇంకొక టెక్నాలజీ..హాబీ ల విషయం తీసుకొంటే ఒక హాబీ ..తరువాత ఇంకొక హాబీ ..నెమ్మదిగా ఇంకొక మంచి హాబీ..ఇలా..
ఇలా చేపుకొంటూ పోతే ..చాలా విషయాల్లో నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అవ్వడం అనేది చాలా సంతృప్తినిస్తుంది..
ఏదైనా ఒక పనిని కొంత సేపు చేస్తే దాని పైన అవగాహన వస్తుంది..కొద్ది రోజులు చేస్తే దాని పైన పట్టు వస్తుంది..అలా చాలా కాలం చేస్తే దాంట్లో మాస్టర్ అవ్వొచ్చు ...
కావలసిందల్లా ఒక విషయంపై ఆసక్తి పెంచుకోవడం..కొద్ది కొద్ది గా లక్ష్యం సెట్ చేసుకోవడం..దానిని రోజూ వారీగా కొంత సమయం కేటాయించి నెమ్మదిగా మన లక్ష్యం చేరుకోవడం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి