ప్రపంచంలోని బాధలన్నీ గాలికొదిలేసి ఆదమరచి నిద్ర పోవడం లో ఆనందం ఉంది..
నచ్చిన పని చేయడం లో ఆనందం ఉంది ..
ప్రపంచాన్ని ఎదిరించ డం లో ఆనందం ఉంది..
ప్రశ్నించడంలో ఆనందం ఉంది..
కలగనడంలో ,వర్షంలో తడవడంలో,భావాలు వ్యక్తీకరించడంలో ,ఇష్టం వచ్చినట్లు ఉండడంలో ,గంభీరంగా ఆలోచించడంలో ,వెర్రిగా నవ్వడంలో ,అందాన్ని ఆరాదించడంలో ,కొత్తగా ఆలోచించడంలో ,నమ్మినదాన్ని ఆచరించడంలో ,వంటరి తనంలో ,అడవుల్లో విహరించడంలో ,కొత్తవిషయాలు నేర్చుకోవడంలో,మల్లెల సువాసనలో ఆనందం ఉంది..
అప్పుడే మొలకెత్తిన మొక్కను గమనించడంలో ,సంగీతంలో ,అందమైన ప్రదేశాలలో ,భయం లేకపోవడంలో,చెట్టునీడలో ,అందమైన సూర్యోదయంలో ,గమ్యం లేని ప్రయాణంలో ,ప్రయోగం చేయడం లో ..
నిన్ను నీవు తెలుసుకోవడం లో ఆనందం ఉంది..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి