చలం 'ప్రేమలేఖలు' లో నాకు నచ్చిన కొన్ని పేరా గ్రాఫ్ లు..
*ఈవాళ ఎందుకో చాలా దిగులుగా ..నిరాశగా వుంది..అంతం ఏమిటి?..ఈ ప్రేమకంతా ..ఆనందానికంతా అంతం..వృద్దాప్యామూ..చావూ ..మరణమూ..ఈ జీవితం అంతం అన్న సంగతి ,ఈ లోకాన్ని విడిచిపోయే రోజు సంగతి తలచుకొంటే అంత విచారం కలుగుతుంది..ఏమి లాభం?..ప్రేమించి ..అనుభవించి ..ఆనందించి ..అవన్నీ బూడిద అయఎందుకే గదా?..ఎప్పుడూ అంతం లేకుండా ఇట్లా అందంగా బతకడానికి వీలేందుకు లేదో?..ప్రేమను మద్యలో తెంపే వాడు ..ఒకరిని చంపి ,ఒకరిని విడిచి పెట్టే వాడు ..పోనీ ముసలితనంలో నైనా ఈ జీవితాన్ని లయం చేసే వాడు ..
వాడు రాక్షసుడు..
*నన్ను చూసి ప్రజలు..వీడి బతుక్కి ..వీదికేందుకా ఇంత ఉత్సాహం ..ఈ పొగరు?దేన్ని చూసుకునా ?అన్నట్లు చూస్తారు..నా కళ్ళలో కాంతి,నా మొహం లో ఆనందం వాళ్లకు అర్థం కాదు..నా హృదయంతరాలం లో కనపడక వెలుగుతో ,నా మొహం లో కి తన కిరణాలు వేదజిమ్మే నీ ప్రేమే కారణమని వాళ్లకు ఏమి తెలుసు?..ప్రేమ రాజ్యాదిపతినైన నేను భౌతికంగా బంట్రోతునైతేనేమి?..బానిసనైతేనేమి? ..నా ఉత్సాహాన్ని దాచుకోగాలనా?..
నీ ముద్దులతో నిర్మలమైన మొహం లో కాంతి ఎట్లా మరుగు పడుతుంది?నీవలెను,నావలెను అంత గాడంగా ప్రేమించు కునేవారు కూడా ..ఒకరినొకరు సంపూర్ణం గా అర్ధం చేసుకోవడం ఎంత కష్టం? ..ఎంత విచిత్రమైన లోకం?..
*రాత్రి పది గంటలు..నా గుడిసె లో వంటరిగా కూర్చొని వున్నాను..రోజల్లా.విరామం లేకుండా వాన కురిసింది..ఇంకా కురుస్తోంది..బయట కటిక చీకటి..ప్రతి నిమిషం తన లోకి ప్రవహించే ఈ పట్టణపు మురికి వాన నీటిని ,కలుపుకోవడం ఇష్టం లేక పోట్లాడుతుంది నది..చలి..తలుపు దగ్గిరగా దీపం నీడలో కూర్చొని రాస్తున్నాను నీకు..కొంచం వైనూ ,నువ్వూ ..అంతే తక్కువ నాకు..పోనీ వైను వద్దులే ..వేడి కాఫీ చాలు..ఈ రాత్రికి రాకూడదా నువ్వు?..
ఇన్ని సంగతులు ,విచిత్రాలు జారుగుతాయే..తప్పి జారి, పొరబాటున..ఇది జరగ కూడదా? ..అనుకొంటాను? ..అనేకమంది వస్తారు ..వెడతారు ..అనుకోని విషయం గా నువ్వు నా దగ్గరికి రావడం అనేది ఈ రాత్రి జరగకూడదా?..ఇన్ని అద్భుతాలు జరిగే ఈ లోకంలో ఇది అసంభవమా?
నువ్వు నాకు చెప్పిన అరేభియాన్ నైట్స్ ..కధలో ఎవరో దేవతలు ..చైనా దేశపు రాకుమారిని ఒక రాత్రి హట్టాతుగా..బాగ్దాద్ రాజకుమారును పక్కలో పడుకోబెట్టి ,తెల్లవారే తీసుకుపోయినారు కదా?..ఆ దేవతలు ఈ కాలంలో లేరా?వుంది నా మీద కనికరించారా? ..
*ఈ వాళ పొద్దున నేను లేచి చూసేప్పటికి ,చక్కని,గుండ్రని చిలకలు రెండు నా శీతాఫలం చెట్టు మీద ,నేను నాకోసం బాగా పండాలని ఉంచుకున్న పెద్దపండును ఫలహారం చేస్తున్నాయి..ఒక్కొక్క గింజే ..చేరోకసారీ ముక్కు ముంచి తీసుకుని చక్కగా కబుర్లు చెప్పుకొంటూ తింటున్నాయి ..నాకు కోపమొచ్చి తరిమేయ్యబోయి ఆగాను..
కూచొని అంతం లేని కబుర్లతో నన్ను కవ్వించే నువ్వు జ్ఞాపకం వచ్చావు..ఇద్దరం ఎన్ని గంటలు నది నీల్లవంక చూస్తూ విసుగులేని కబుర్లు అర్థమూ ,అంతమూ లేకుండా చెప్పుకునేవాళ్ళం?..వాటికిట్లా పొద్దున కడుపులు నిండితే..ఇక రోజంతా హాయిగా ,కాంతిలో ,ప్రేమలో,అరుస్తో,చెట్లలో దాగుడుమూతలాడుతో ఆడుకోగలవు కదా?..
పోనీ వాటినన్న సుఖించనీ ..
*ఇట్లా కొనడమూ..తీసుకు రావడమూ..దాచుకోవడమూ..వండుకోవడమూ..తినడమూ..ఇదంతా అసహ్యముగా ..అనవసరముగా తోస్తుంది..కొంచెం ఉన్నతమైన ఆనందం వారికి తోచినా ఈ చీదర నుంచి ప్రజలు బయట పడగలరనుకుంటున్నాను..వాళ్ళ సంగతి పోనీ ..నేను!ప్రస్తుతం నేనెట్లా తప్పించుకోగలను?పరిస్థుతులను ఈ బురదలో నాటి ,ఆత్మని మాత్రం ఆకాశం లో పెట్టి సృజించాడు దేవుడు..ఎంత క్రూరమిది?..
మృగాలు ,పక్షులు యెంత హాయిగా తిరుగుతున్నాయి..మనుషులకే వచ్చింది ఈ కష్టమంతా ..ఈ మృగాలకి,పక్షులకి కూడా ఈ మనుషుల వల్ల కష్టమే కదా ..తాము ఘనులమని ,కవులమని ,వీరులమని ,చక్రవర్తులమని,రానులమనీ,దేవతలమనీ విర్రవీగుతారే ..వారందరూ కూడా ఇలా జీవ రాశులను ముక్కలు చేసుకొని వండుకొని తినవలసినదేగా? మళ్ళీ దాంట్లో తగాదాలు ,మృగమనీ ,చెట్లు అనీ వంకలు,చివరికి ఉల్లిపాయ తినొచ్చు..తినగూడదని నిషేదాలు!ప్రాణిని ప్రాణి చంపి తినడం ఎట్లానూ తప్పదు..చంపడం,వండడం,ఆత్రుతతో నోట్లోకి దూర్చుకోవడం,ఆరగించుకోవడం ..మళ్ళీ బయటకి అసహ్యం గా మురికిగా తోసేసుకోవడం ఇవన్నీ తప్పదు కదా? ..ఏమి ఘనత వుంటుంది మనుషులకి? ..చక్రవర్తులైతేనేమి ?నవ నవ లాడే చెట్లనీ ,గంతులు వేసే మృగాలనీ
బలంగా ఎదిగే కాయల్నీ ,కళకళలాడుతో ఎగిరే పిట్టల్ని చంపి ,కోసి,పీకి తినడం తప్పక పోయిన తరువాత?..
(మిగతా తరువాత టపా లో..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి